← back

Never-before-seen 2-foot miniature cows | Miniature Cows | Rythubadi

Original: ఎక్కడ, ఎప్పుడు చూడని 2 అడుగుల పొట్టి ఆవులు🐄 | Miniature Cows | Rythubadi

1.5M views · Jun 09, 2022 · 12:30 min · Watch on YouTube ↗
Takeaway

True miniature Punganur cows under 2 feet tall are an apartment-friendly indigenous breed selling for Rs 6 lakh+ a pair due to extreme rarity.

Summary

  • Dr Krishnaraju runs Nadipathi Goshala at Lingamparti village (Yeleswaram mandal, Kakinada dist) with 400 cows, mainly Punganur, including a rare miniature line under 2 ft tall
  • Miniature calves are born under 12 inches; only ~12 born from 200 cows bred, making them very rare
  • Pedigree traced to ancient Brahma breed (now Brahman/Brahmin lineage); Andhra has 4 draft breeds — Ongole, Punganur, Deverakonda and Manyam
  • Suitable for apartment/balcony rearing in Hyderabad, Vizag, Guntur, Vijayawada; eats a tiffin-box worth of feed per day; sold only in male-female pairs
  • Punganur-cross small cows cost up to Rs 50,000; certified miniatures cost Rs 6 lakh+ and are only sold to serious breeders
punganurminiature-cowdesi-breed
Original description
పుంగనూరు జాతి ఆవులలోనే మరింత పొట్టి రకం ఆవుల గురించి ఈ వీడియోలో వాటిని పెంచుతున్న డాక్టర్ క్రిష్ణంరాజు గారు వివరించారు. అయితే ఈ రకమైన పొట్టి ఆవులు వ్యవసాయం చేసుకునే రైతులకు, పాల వ్యాపారం చేసే డెయిరీ నిర్వాహకులకు అస్సలు ఉపయోగపడవు. ఎవరైనా ఇలాంటి అరుదైన ఆవులను కొనుగోలు చేయాలని అనుకుంటే ముందుగా ఆవుల పెంపకంలో అనుభవం కలిగిన గోశాలల నిర్వాహకులను కలిసి వివరాలు తెలుసుకోండి. ఇలాంటి ఆవులు ఉంటాయా.. ఉంటే ఆ గోవులలో ఉండే ప్రత్యేకతలు ఏమిటి.. వంటి వివరాలన్నీ ఆరా తీయండి. విషయం పూర్తిగా తెలుసుకోకుండా.. ఎక్కువ డబ్బులు పెట్టి ఇలాంటి వాటిని కొనుగోలు చేయొద్దని తెలుగు రైతుబడి విజ్ఞప్తి చేస్తోంది. చిన్నగా పెరుగుతున్న వీటిని మరుగుజ్జు ఆవులు అంటున్నారు కాబట్టి మున్ముందు వాటికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే విషయాన్ని కూడా వెటర్నరీ వైద్యులను అడిగి తెలుసుకోండి. మేము కూడా మా వంతుగా మున్ముందు మరిన్ని వీడియోలలో ఈ రకమైన ఆవుల గురించి ఇతర నిపుణులను అడిగి మీకు మరిన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తాము. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Miniature Cows.. Cost above 6 Lakhs | 2 అడుగుల పొట్టి ఆవులు | Rythubadi

#PottiAavulu #రైతుబడి #MiniatureCows